శివసేనకు సీఎం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం..! - MicTv.in - Telugu News
mictv telugu

శివసేనకు సీఎం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం..!

November 11, 2019

మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి రాబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలుబడి ఎన్నో రోజులు కావస్తున్నా ఇంకా అక్కడ ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తెలిపేందుకు శివసేనకు సమయం దగ్గరపడుతోంది. ప్రభుత్వం కొలువుతీరాలంటే శివసేనకు కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతు తప్పనిసరి. దీంతో శివసేన ఆ పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్సీపీతో శివసేన చర్చలు జరుపుతోంది. శివసేన ఆ రెండు పార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. 

shiv sena.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరి తెలియజేసేందుకు శివసేన శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్‌ షిండే ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. అటు తాజా పరిణామాలపై చర్చించేందుకు పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో ఎంపీ సంజయ్‌ రౌత్‌ సమావేశమయ్యారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ ఈరోజు ఉదయం భేటీ అయ్యింది. శివసేనతో పొత్తు పెట్టుకుంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి పార్టీ నేతలు చర్చిస్తున్నారు.