బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే. గత లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత కొంతకాలానికే శివసేనలో చేరారు. తాజా సమాచారం ప్రకారం ఆమె త్వరలో చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు.
ఆమెను మహారాష్ట్ర శాసనమండలికి అధికార శివసేన నుంచి ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర మండలిలో 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో గవర్నర్ కోటాలో ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని సమాచారం. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఊర్మిళను మండలికి నామినేట్ చేస్తున్నారనే వార్తలు వాస్తమేనన్నారు. అయితే దీనిపై సీఎం ఉద్దవ్ ఠాక్రేదే తుది నిర్ణయం అన్నారు. ఉర్మిళతో పాటు మరాఠీ నటుడు ఆదేష్ బండేకర్, సింగర్ ఆనంద్ షిండే కూడా ఎమ్మెల్సీగా నామినేట్ కానున్నారని తెలుస్తోంది. అలాగే ఇటీవల బీజేపీ నుంచి ఎన్సీపీలోకి వెళ్లిన సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే కూడా ఎమెల్సీగా నామినేట్ కానున్నారని సమాచారం.