మహా రాజకీయం..శివసేన పోస్టర్లలో ఇందిరా గాంధీ ఫొటోలు - MicTv.in - Telugu News
mictv telugu

మహా రాజకీయం..శివసేన పోస్టర్లలో ఇందిరా గాంధీ ఫొటోలు

November 28, 2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఊహకందని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటుతో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే తొలిసారి ముఖ్యమంత్రి పీటం ఎక్కబోతున్న తరుణంలో రాష్ట్రమంతటా పోస్టర్లు వెలిశాయి.ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను కూడా ముద్రించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఉద్దండుల ఫొటోలు ఒకే పోస్టర్‌పై కనిపించడం అందరిని ఆకర్షిస్తున్నాయి. 

Shiv Sena Posters.

1965లో మరాఠీల అభ్యున్నతి కోసం ప్రారంభమైన శివసేన పార్టీ తొలిసారి అధికారం చేపట్టబోతోంది. థాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు ఆయన కుటుంబం మొదటిసారి రాష్ట్రపాలన పగ్గాలు చేపట్టబోతోంది.దీంతో ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘ ఓ శివసైనికుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు’ అంటూ క్యాప్షన్ పెట్టి పోస్టర్లు వేయించారు.అందులో బాల్‌థాక్రే, ఇందిరా గాంధీ ఒకరికి ఒకరు అభివాదం చేసుకునే ఫొటోలను వేయించారు. కాగా కాగా బాల్ థాకరే, ఇందిరా గాంధీ జీవించి ఉన్నప్పడు ఇద్దరూ ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచారు. 1975లో దేశమంతా వ్యతిరేకించిన అత్యవసర పరిస్థితిని థాకరే సమర్థించారు. ఇప్పుడు ఇలా వీరిద్దరి ఫొటోలు అందరిని ఆకర్షిస్తున్నాయి.