Shiva Lingam is growing day by day in Pakistan
mictv telugu

పాకిస్తాన్‌లో అద్భుతం.. రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం

September 12, 2022

Shiva Lingam is growing day by day in Pakistan

ఉగ్రవాద, మతోన్మాద దేశమైన పాకిస్తాన్‌లో నానాటికీ పెరుగుతున్న శివలింగం ఉందని తెలుసా? శివ నామస్మరణతో నిత్యం మారుమోగే ఆ శివాలయం సింధ్ ప్రావిన్స్‌లోని ఉమర్ కోట్‌లో ఉంది. ఆ పట్టణంలో 80 శాతం హిందూ జనాభా ఉండగా, విభజన సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పటి రాజు ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో కలిపేశాడు.

హిందూ మెజారిటీ ప్రాంతం కావడంతో ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడో స్పెషాలిటీ ఏంటంటే ఈ శివలింగం నానాటికీ పెరుగుతూ వస్తుంది. మొదట్లో లింగం ఎంత పరిమాణంలో ఉందో ఓ గీత గీశారు. తర్వాతి కాలంలో ఆ గీత దాటి శివలింగం పెరగిందనడానికి అక్కడ రుజువులున్నాయి. పై ఫోటోలో మీరు కూడా ఆ చిత్రాన్ని చూడవచ్చు. ఆలయ చరిత్ర అక్కడి భక్తులు చెప్తున్నదాని ప్రకారం ఇలా ఉంది. ప్రస్తుతం జనావాసాలతో నిండిపోయిన ఈ ప్రాంతం ఒకప్పుడు పచ్చిక మైదానాలతో విస్తరించి ఉండగా, కాపర్లు తమ పశువులను మేపడానికి ఈ ప్రాంతానికి వచ్చేవారు. అయితే మందలోని కొన్ని ఆవులు శివలింగం వద్దకెళ్లి వాటంతట అవే పాలివ్వడాన్ని గమనించారు. కాపర్లు వచ్చి చూస్తే శివలింగం కనపడగా, అప్పటినుంచి పూజలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆలయ మహత్యం వల్ల ఇక్కడి ప్రజల్లో ఎలాంటి మత విద్వేషాలు ఉండవని అక్కడి హిందువులు చెప్తారు.