తులసిపై మూత్రం.. నందిపై కాళ్లు.. శివశివా..! - MicTv.in - Telugu News
mictv telugu

తులసిపై మూత్రం.. నందిపై కాళ్లు.. శివశివా..!

April 11, 2018

కొందరికి మైండ్ ఎక్కడ వుంటుందో తెలుసుకోవడం కష్టం. పిచ్చాస్పత్రుల్లో ఉండాల్సిన వాళ్లు సమాజంలో తిరుగుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని పిసినికాడ గ్రామంలోని శివాలయంలో మంగళవారం  ఇద్దరు యువకులు మాటల్లో చెప్పలేని ఘోరాలకు తెగబడ్డారు. పవిత్రంగా భావించే నంది విగ్రహంపై కాళ్లు కడిగారు. తులసి చెట్టుపై మూత్రం పోశారు. వెటకారంగా మాట్లాడారు. పూజాసామగ్రిని అపవిత్రం చేశారు. ఈ దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

శివాలయం పొలాల్లో ఉండడం, జనం పెద్దగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. కొందరు గ్రామస్తులు వారిని వారించబోయారు. అయినా వినకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితులను శాంతిపురానికి చెందిన ఆనంద్, రమేష్ ఆనంద్ గా గుర్తించారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు.