shiva was a copy movie : varma
mictv telugu

శివ స్టోరీ అంతా ఆ సినిమా కాపీనే : రాంగోపాల్ వర్మ

July 12, 2022

shiva was a copy movie : varma

సంచలన హిట్ చిత్రం శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ చిత్రంతో టాలీవుడ్ అప్పటివరకు వెళ్తున్న మార్గాన్ని పూర్తిగా మార్చేశాడు. తన టేకింగ్, యాక్షన్, నటుల పర్మార్మెన్స్, కెమెరా యాంగిల్స్ వంటి వాటితో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

అయితే ఈ సినిమా ఓ సినిమాకు కాపీ అని బాంబు పేల్చాడు వర్మ. ఆయన తాజాగా తెరకెక్కించిన లడ్కీ చిత్రం ప్రమోషన్లలో ఈ విషయాన్ని తొలిసారి బయటపెట్టాడు. ‘రిటర్న ఆఫ్ ది డ్రాగన్ కథ, శివ కథ ఒకటే. కాకపోతే అందులో రెస్టారెంటు, శివలో కాలేజీ ఉంటుంది. మిగతాదంతా సేమ్. ఆ సినిమా చూసే నేను శివ సినిమా స్క్రిప్టు 20 నిమిషాలలో రాయగలిగాను. కాకపోతే మన నేటివిటీకి అనుగుణంగా మార్చి చెప్పడంతో నాగార్జున ఇంప్రెస్ అయి నాకు అవకాశం ఇచ్చారు. తప్న ఇందులో నా మేధావీ తనం ఏమీ లేదు’ అని వెల్లడించాడు.