Shivani Rajasekhar dropped out of the Missindia competition
mictv telugu

మిస్సిండియా పోటీల నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణం తెలిస్తే షాక్

June 30, 2022

హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ మిస్ ఇండియా పోటీలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రం తరపున ఆమె ఈ పోటీలో పాల్గొనగా, తాజాగా పోటీల నుంచి తప్పుకున్నట్టు ఆమె ప్రకటించింది. ఇప్పటికే లీగ్ దశ అయిపోయి ఫైనల్‌కు చేరగా, శివానీ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు ఆమె చెప్పిన కారణం సబబుగానే ఉంది. శివానీ ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు తన చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న ఆమె.. జులై 3న మిస్సిండియా ఫైనల్స్ జరుగనుండగా, అదే రోజు మెడిసిన్ పరీక్ష ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హాజరు కావాల్సి వచ్చింది. ‘నాకు మెడికల్ ఎగ్జామ్ ప్రిపోన్ అవ్వడం, మలేరియా జ్వరం రావడంతో మిస్సిండియా ఫైనల్ పోటీలకు పాల్గొనలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ఎగ్జామ్స్ అనుకున్న తేదీ కంటే ముందే ప్రారంభమయ్యాయి. నాకు మద్ధతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను పరీక్షల కోసం గుంటూరులో ఉన్నాను’ అని వివరణ ఇచ్చింది. దాంతో నెటిజన్లు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మిస్సిండియా పోటీలకు వచ్చే ఏడాది కూడా హాజరు కావచ్చు కానీ, పరీక్షలు మిస్సయితే మాత్రం ఏడాది నష్టం వాటిల్లుతుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు అని కామెంట్ చేస్తున్నారు. కాగా, అద్భుతం అనే సినిమా ద్వారా శివానీ వెండితెరకు పరిచయమైంది.