Shivaratri 2023 : Hit Movies Re Release For Maha Shivaratri 2023
mictv telugu

హిట్ సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి.

February 17, 2023

Shivaratri 2023 : Hit Movies Re Release For Maha Shivaratri 2023

రీ రిలీజ్ ట్రెండ్ మళ్ళీ మొదలయ్యింది. ఈమధ్య తెలుగు సినిమాలు పాతవి మళ్ళీ విడుదల అయ్యాయి. హీరోల పుట్టినరోజులు, లేదా సినిమా వచ్చి పదేళ్ళు అయింది లాంటి కారణాలతో కొన్ని థియేటర్లలో హిట్ సినిమాలను మళ్ళీ వేస్తున్నారు. జనాలు కూడా వీటిని మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్ళి చూస్తున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పడు శివరాత్రి సందర్భంగా మళ్ళీ కొన్ని తెలుగు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అవేంటో , ఎక్కడ రిలీజ్ చేస్తున్నారో మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

పుష్ఫ:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా ఒక ఊపు ఊపింది. మొత్తం దేశమంతా కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు మహాశివరాత్రి కోసం దీన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారుజ ఫిబ్రవరి 18న హైదరాబాద్ లో సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు.

అఖండ:

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ. అఘోరాగా బాలకృష్ణ ఇందులో అదరగోట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ ను బద్దలు గొట్టింది కూడా. ఇప్పడు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ లో అర్థరాత్రి 12.15 కు మళ్ళీ షో వేస్తున్నారు. అలాగే సుష్మలో రాత్రి 11.49 గంటలకు వేయనున్నారు.

వాల్తేరు వీరయ్య:

ఇది ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా. చారా రోజుల తర్వాత చిరంజీవి బిగ్ హిట్ ఇచ్చిన మూవీ. దీన్ని కూడా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. రేపు సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్ధరాత్రి 12.15 గంటలకు, ఉదయం 3గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేస్తున్నారు.

కాంతార:

కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార ఎంత మిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కామ్ గా, చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద సంచలనమే సృష్టించింది. అక్టోబర్ లో వచ్చిన ఈ సినిమాను శివరాత్రి రోజు మళ్ళీ స్పెషల్ షో గా వేస్తున్నారు. సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్ లో అర్ధరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు రెండు షోలు ప్రదర్శించనున్నారు.

టెంపర్:

జూ ఎన్టీయార్, పూరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ టెంపర్. ఎన్నటీయార్ కొత్త లుక్ తో పాటూ, కొత్త డైలాగ్ డెలవరీ చేసిని సినిమా ఇది. దీన్ని కూడా శివరాత్రి రోజు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని దేవి థియేటర్స్ లో అర్ధరాత్రి 12.15గంటలకు, సంధ్య థియేటర్స్ లో 12.30 గంటలకు షో వేయనున్నారు.

వీటితో పాటూ సరిలేరు నీకెవ్వరు సినిమాను కొత్తపేటలోని మహాలక్హీ కాంప్లెక్స్ లో రాత్రి 11.59కి, దూకుడు మూవీని సుదర్శన్ లో ఉదయం 3 గంటలకు, భీమ్లానాయక్ సినిమాను మహాలక్ష్మి కాంప్లెక్స్లో ఉదయం 3గంటలకు షోలు వేయనున్నారు.