భోగాలెన్నో వద్దన్నాడే శంభోశివ.. శివరాత్రి పాట ప్రోమో ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

భోగాలెన్నో వద్దన్నాడే శంభోశివ.. శివరాత్రి పాట ప్రోమో ఇలా..

February 17, 2020

Shivaratri Song.

మైక్ టీవీ నుంచి వచ్చే పాట అంటేనే ప్రేక్షకులలో చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మళ్లీ ఓ మంచి పాటతో మీ అభిమాన ఛానల్ మైక్ టీవీ శివరాత్రి పాటతో వస్తోంది. ప్రస్తుతం ప్రోమో వచ్చింది. ప్రముఖ గాయని శిశిర, మిట్టపల్లి శ్రీనివాస్ ఇద్దరూ ఈ పాటను పాడారు. ‘మహాదేవా.. భోళా శంకరా ఈశ్వరా శంభోశివా.. భోగాలెన్నో వద్దన్నాడే శంభోశివ.. కీర్తి తనకు వద్దన్నాడే శంభోశివ’ అంటూ సాగుతుంది పాట. ఇప్పటికే చాలామంది ప్రోమోలో పాట చాలా బాగుంది.. మీ పాట కోసం ఎదురు చూస్తున్నాం అని కామెంట్లలో తెలుపుతున్నారు. 

ఈనెల 21న శివరాత్రి మహా పర్వదినం ఉండగా అంతకుముందే ఈ పాట పూర్తిగా మీ ముందుకు తీసుకువస్తాం. ఈ పాటలోని గాయకుడు మిట్టపల్లి శ్రీనివాస్‌కు ఇది తొలిపాట. మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహించిన ‘ఫోక్ స్టూడియో’ కార్యక్రమం ద్వారా శ్రీనివాస్ పరిచయం అయ్యారు. ఆయనకు కళ్లు కనిపించకపోయినా మనసు పెట్టి ఈ పాటను ఆలపించాడు. మదీన్ సంగీతం అందించగా, యశ్‌పాల్ సాహిత్యం అందించారు. త్వరలో మీ ముందుకు పూర్తి పాటతో వస్తున్నాం.