Shivpal Singh, judge who convicted Lalu Prasad, gets married at 59
mictv telugu

మరో 6 నెలల్లో రిటైర్‌మెంట్.. లాయర్‌తో జడ్జి ప్రేమ వివాహం

September 6, 2022

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మరో ఆరు నెలల్లో రిటైర్‌మెంట్ తీసుకోనున్న శివపాల్ సింగ్(59)… న్యాయవాది, బీజేపీ నాయకురాలైన మహిళని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా జడ్జి శివ్‌పాల్‌సింగ్‌ తన స్నేహితురాలు, బీజేపీ నాయకురాలు అయిన 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని శివపాల్ సింగ్ వివాహం చేసుకున్నారు.

 

వృత్తిరీత్యా లాయర్ అయిన నూతన్ భర్త 2006లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. న్యాయమూర్తి శివపాల్ భార్య 20ఏళ్ల క్రితమే మరణించారు. శివ్‌పాల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నూతన్‌కు ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరు వివాహం చేసుకున్నారు. శివపాల్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో నూతన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సాన్నిహిత్యం మరింత పెరిగి ప్రేమకు దారితీసింది. చివరికి ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా వారి వివాహం వారి పిల్లల అనుమతితో వీరి వివాహం జరిగింది.