జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబుగా ఎవరంటే?     - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబుగా ఎవరంటే?    

February 17, 2020

xdcb

భారతీయ వెండితెర.. గతాన్ని తవ్వుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. అన్నిచోట్లా  బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినీ,రాజకీయ, క్రీడా తదితర రంగాలకు సంబంధించిన వారి జీవిత చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కూడా సినిమా తీస్తున్నారు. ‘తళైవి’ పేరుతో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీంట్లో ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు జయలలితో అప్పటి నటుడు శోభన్ బాబుకు మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ కోసం చాలా మంది ఆసక్తిగా చూసేవారు. అలాంటిది ఆయన పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంతకాలం సస్పెన్స్ ఉంటూ వచ్చింది. 

తాజాగా ఈ సినిమాలో శోభన్ బాబు పాత్రలో చేసేది ఎవరనే విషయం బయటకు వచ్చింది. తళైవి సినిమాలో శోభన్ బాబు పాత్రను బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా సమాచారం. ఆయన పాత్రకు జిషు న్యాయం చేయగలడని భావించి అతన్ని ఎంపిక చేసుకున్నారట.
జిషు సేన్ గుప్తా ఇటీవల తెలుగులో వచ్చిన ‘అశ్వద్ధామ’లో విలన్‌ పాత్రను పోషించాడు. ఈయనే శోభన్ బాబు క్యారెక్టర్ చేయనున్నాట. కాగా ఇప్పటికే ఒకప్పటి స్టార్ హీరో ఎంజీ రామచంద్రన్‌ పాత్రలో విలక్షణ నటుడు అరవింద్‌ స్వామి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు వేగవంతం చేసుకుంటున్న ఈ సినిమా జూన్ 26  ప్రేక్షకుల ముందుకు రానుంది.