సింగారాల పైరుల్లోనా….. పాట గుర్తుకుందా… ఆమెనే నట శోభన నాట్యమయూరి….లేట్ వయస్సులో పెండ్లికి సిద్దం అయిందట. ఇంతకు ముందు ఆమె పెండ్లి చేసుకోనని చెప్పిందామే.తన జీవితం నటనకే అంకితం చేస్తానని కూడా అన్నది. అప్పట్లో అభినందన, రుద్రవీణ, అల్లుడుగారు, రౌడిగారి పెళ్లాం వంటి సిన్మాలో నటించింది. అభినందన సిన్మా నాటి తరం కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుని అభిమాన తార శోభన. 2001లో ఓ అమ్మాయిని దత్తతీసుకుని పెళ్లికి గుడ్ బై చెప్తున్నట్లు సిగ్నల్ కూడా ఇచ్చింది. చివరి సారిగా 2013 లో మలయాళ చిత్రం థిరలో వెండి తెరపై వెలిగారు. ఆ తర్వాత నుండి సిన్మాల్లో లేనే లేరు… అయితే బాగా లేట్ అయిన తర్వాత మంచు కురిసే వేలలో మల్లె విరిసేదెందుకోని అని పాడాలనుకుంటున్నట్లుంది. అన్నట్లు ఇప్పుడు శోభన వయస్సు అక్షరాల 47 ఏండ్లు. ఇప్పటికైనా ఓ తోడు కావాలని కోరుకుంటున్నట్లుంది. అందాల తార, నృత్యభామ మనమూ మ్యారేజీ విషెష్ చెబ్దాం.