Shobhita Dhulipalla reacting on dating with Chaitu
mictv telugu

చైతూతో డేటింగ్ వార్తలపై స్పందించిన శోభితా ధూళిపాళ్ల.. వీడియో వైరల్

June 27, 2022

సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అటు నాగ చైతన్య కానీ, ఇటు శోభితా కానీ ఇంతవరకు స్పందించలేదు. పైగా ఇలాంటి రూమర్లను సమంతే క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తుందని ఓ నెటిజన్ సమంతను తిట్టిపోశాడు. అయితే ఆమె తన స్టైల్లో రియాక్షన్ ఇచ్చిందనుకోండి. ఇప్పుడు శోభితా ధూళిపాళ్లకు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో ఎఫైర్ అంటగట్టిన వారికి ఇదే సమాధానమంటూ చాలా మంది భావిస్తున్నారు. ఈ వీడియోలో శోభితా మొదట నవ్వుతూ తర్వాత కుడిచేతిలోని మధ్యవేలును సింగిల్‌గా చూపించి సీరియస్ రియాక్షన్ ఇస్తుంది. దీనిని బట్టి వీరిద్దరి మధ్య ఏ అఫైర్ లేదని అర్దమవుతోందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ వీడియో ఇప్పటిది కాదు. ఎప్పటి వీడియోనో తెచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు. పైగా వీడియోను శోభితా తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేయలేదు కాబట్టి అలా ఎలా అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై వారిద్దరిలో ఎవరో ఒకరు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేకపోతే ఈ రూమర్లు ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి.