ఆర్ఆర్ఆర్ ఓ చెత్త సినిమా.. ఆస్కార్ విజేత కామెంట్లపై శోభు ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ఆర్ఆర్ ఓ చెత్త సినిమా.. ఆస్కార్ విజేత కామెంట్లపై శోభు ఫైర్

July 6, 2022

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌ థియేటర్లలో ఘన విజయం సాధించింది. తర్వాత ఓటీటీలో కూడా విడుదలై రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. అలాంటి ఈ చిత్రంపై ఆస్కార్ విజేత రసూల్ పోకుట్టి తనదైన కోణంలో వ్యాఖ్యలు చేశారు. ఇది గే లవ్ స్టోరీ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌ను చూసిన చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు. ‘ఈ చిత్రం గే లవ్ స్టోరీ అని నేననుకోవడం లేదు. మీరెలా చెప్తారు? ఒకవేళ గే లవ్ స్టోరీ అయినా కూడా అందులో తప్పేముంది. మీలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి తగింది కాదు’ అని విమర్శించారు. దానికి బదులుగా రసూల్ ‘మీరు చెప్పింది నిజమే. అది గే లవ్ స్టోరీ అయినా అందులో తప్పేం లేదు. నా ఫ్రెండ్ చేసిన ట్వీటుకు నేను స్పందించా. నేను ఎవరినీ ఉద్దేశించి అలా అనలేదు. ఇందులో వక్రీకరించాల్సింది కూడా ఏమీ లేదు. కానీ, సోషల్ మీడియాలో బాగా వ్యాపించింది. శోభూ గారు.. మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు’ అని రిట్వీట్ చేశారు. అటు రసూల్ ట్వీట్‌పై స్పందించిన సంగీత దర్శకుడు కీరవాణి తర్వాత దానిని తొలగించారు. కాగా, స్టమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను రసూల్ పోకుట్టి సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఇటీవల ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలకు ఆయన పనిచేశారు.