బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు సినీ ప్రియులు గట్టి షాక్ ఇస్తున్నారు. తాజాగా అక్షయ్ కూమార్ కథనాయకుడిగా నటించిన ‘సామ్రాట్ పృధ్వీరాజ్’ సినిమాకు ప్రేక్షకులు ఎవరు సినిమా హాల్స్‌కు రావటం లేదు. దీంతో చిత్రాన్ని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ యాజమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎవరు రాకపోవడంతో సినిమా హాల్స్ యాజమాన్యాలు షోలను రద్దు చేస్తున్నారు.
బాలీవుడ్లో అక్షయ్ కూమార్ కొత్త సినిమా వస్తుందంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆయన అభిమానులు, సినీ ప్రియులు.. తాజాగా అక్షయ్ కూమార్ నటించిన ‘సామ్రాట్ పృధ్వీరాజ్’ సినిమాకు వెళ్లటం లేదట. అందుకు ప్రధాన కారణం సినిమా అంతగా ఆకట్టుకోవటం లేదట. రూ.300 కోట్ల బడ్జెట్‌తో, ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 3న విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి నేటీవరకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.
ఇప్పటి వరకూ ఈ సినిమా కేవలం రూ.55 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రేక్షకులు ఎవరు సినిమాను వీక్షించకపోవటంతో చాలా థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేస్తున్నారట. కొన్నిచోట్ల థియేటర్లలో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రదర్శనలు నిలిపివేస్తున్నారట. రాను రాను బాలీవుడ్ సినిమాలపై ప్రేక్షకులకు అంతంగా ఆసక్తి చూపటం లేదని ముంబై మీడియా సంస్థలు కథనాలను రాస్తున్నాయి.
మరోపక్క అక్షయ్ కుమార్ ఖాతాలో సంవత్సరానికి 1000 కోట్లు వసూలు చేసిన చరిత్ర సృష్టించిన రోజులు ఉన్నాయి. బాలీవుడ్లో అతిపెద్ద హీరోలలో ఆయన ఒకడుగా పేరుగాంచారు. అటువంటి స్టార్ హీరో సినిమా ఈరోజు దివాళా తీసే పరిస్థితి రావటంతో సంచలనంగా మారింది. ప్రేక్షకులు లేక సినిమా హాల్స్ వెలవెలబోతున్నాయి. ఈ చిత్రాన్ని చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దారు. చిత్రంలో.. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనూ సూద్, మానుషి చిల్లర్, మానవ్ విజ్, అశుతోష్ రాణా, మరియు సాక్షి తన్వర్ నటించారు. ఈ చిత్రానికి డా. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా, శంకర్-ఎహసాన్ సంగీతం అందించారు.