దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే భారీగా పెరగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత ఏడు రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు ధరలు భగభగ మండనున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలైన వంట నూనె, చికెన్ వంటి ధరలు పెరిగాయి. దీంతో ముడి చమురు ధరలు సైతం ఒక్కసారిగా ఎగబాకనున్నాయి. ఇప్పటికే మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు చేరుకుంది.
మరోపక్క యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు 150 నుంచి 180 వరకు పెరిగి అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..
1. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20. డీజిల్ ధర రూ.94.62.
2. కరీంనగర్లో పెట్రోల్ ధర రూ.108.39., డీజిల్ ధర రూ.95.85.
3. ఖమ్మంలో పెట్రోల్ రూ. 108.94., డీజిల్ ధర రూ.95.29.
4. మెదక్లో పెట్రోల్ రూ.108.66., డీజిల్ రూ.95.05.
5. రంగారెడ్డిలో పెట్రోల్ ధర రూ. 108.20., డీజిల్ రూ.94.62.
6. వరంగల్లో పెట్రోల్ రూ. 107.69., డీజిల్ ధర రూ.94.14గా ఉంది.