సెలబ్రిటీలెవరైనా కాస్త జనాల్లోకి వెళ్లారంటే.. వారిని ముట్టుకునేందుకు అభిమానులు చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంటారు. వారిని తాకితేనే తమ జన్మధన్యమైనట్లుగా ఫీలవుతుంటారు. హీరోలకు, హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు ఎదురై ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని, అభిమానులపై కోప్పడి వార్తల్లో నిలిచారు కూడా. అలా అని నొప్పించకూడదని కామ్ గా ఉంటే మాత్రం.. కొందరు ఆకతాయిలు విచ్చలవిడిగా రెచ్చిపోతారు. హీరోయిన్‌లను తాకేందుకు, వారిపై చేతులు వేసేందుకు ఏ మాత్రం సంకోచించరు. నవ్వుతూనే కొంటె పనులు చేసి వారిని షాక్ కు గురిచేస్తుంటారు. ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ హీరోయిన్ అపర్ణ బాలమురళీని ఒకడు హద్దు మీరి స్టేజ్ మీదనే భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు.
WTH 😂😭❤️#AdityaRoykapur pic.twitter.com/NjKH6AtnQV
— AdiShe (@AdiSheOfficial) February 15, 2023
అయితే ఈ హద్దు మీరడం మగాళ్లకే పరిమితం కాట్లేదు. లేడీ ఫ్యాన్స్ కూడా కాస్త లిమిట్స్ దాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ని ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దాడబోయిన ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన రాబోయే సిరీస్ ది నైట్ మేనేజర్ ముంబై స్క్రీనింగ్‌లో ఒక మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు.దీంతో ఆదిత్య రాయ్ కపూర్ అసౌకర్యానికి గురయ్యాడు. ఆదిత్యరాయ్ కపూర్ ఆనందంగా ఫొటోల కోసం పోజులిస్తుండగా ఒక మహిళా అభిమాని బలవంతంగా అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. చుట్టూచేతులు వేయడంతో స్టార్‌కి అసౌకర్యంగా అనిపించింది. ఆదిత్య రాయ్ కపూర్ నవ్వుతూ, మెడ చుట్టూ ఉన్న మహిళ చేతిని తీసివేశాడు. దీంతో మహిళా అభిమాని నటుడి చేతిని ముద్దాడింది. తాజాగా ఆదిత్య రాయ్ కపూర్ విషయంలో ఓ లేడీ ఫ్యాన్ కాస్త హద్దులు దాటింది. దీంతో ఆ ఆంటీ మీద జనాలు ఫైర్ అవుతున్నారు. ఇదే రకంగా ఓ మగాడు ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? ఇది మీకు న్యాయంగా ఉందా? అలా ఎవరైనా సెలెబ్రిటీలను ఇబ్బంది పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.