shocking news about super star krishna assets
mictv telugu

దారుణం.. వేల కోట్ల ఆస్తులన్నీ మాయం.. అప్పుల ఊబిలో సూపర్ స్టార్ కృష్ణ

November 15, 2022

నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో మృతి చెందటం టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. సూపర్ స్టార్‌ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు హైదరాబాద్‌కి తరలి వస్తున్నారు. కృష్ణ హీరోగానే కాదు.. నిర్మతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఎన్నో రంగాల్లో విజయవంతమైన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ఒకే సంవత్సరంలో 24సినిమాలు విడుదల చేయటం, ఒకే రోజులో నాలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొనటం, తన సొంత బ్యానర్ నుండి వరుసగా సినిమాలను నిర్మించటం ఇలా సినిమానే ఊపిరిగా బ్రతికాడు కృష్ణ. అయితే కృష్ణ క్రేజ్‌కి, ఆయన సంపాదించిన ఆస్తులకి మాత్రం ఎక్కడ పోలిక లేదంటూ ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రతికున్నంతవరకు ఎవరికీ తెలియని ఈ విషయం.. కృష్ణ మృతి తరువాత టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతుంది.

ఆర్థిక లావాదేవీల్లో కృష్ణ ఒట్టి అమాయకుడని.. ఆస్తులని పెద్దగా పోగేసుకోలేదని.. కష్టపడి సంపాదించినా ఆస్తులు సైతం పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయాడని.. అవి తీర్చడానికి ఒకానొక సమయంలో తన పద్మాలయ స్టూడియోని కూడా అమ్మడానికి చూశాడని షాకింగ్ న్యూస్ ఒకటి బయటికొస్తుంది. ఇండస్ట్రీ అగ్ర హీరోల్లో ఒకరిగా వెలిగిన కృష్ణ ఆస్తులు అమ్ముకునేంత దారుణ పరిస్థితికి రావటం వెనుక.. ఆయన బిజినెస్ మైండ్ కాకపోవటమే అంటున్నారు. డబ్బు విషయంలో కృష్ణ ఎప్పుడూ అమాయకత్వంతోనే ఉండేవారట. ఈ విషయాన్ని విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. 1980 నుండి 1990లలోనే ఆయన 300కోట్ల ఆస్తులు సంపాదించారట.
తన స్వంత గ్రామం బుర్రిపాలెంలో, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కృష్ణ పేరిట ఇల్లులు, ఫామ్ హౌస్‌లు ఉంటే.. గ్యారేజ్ లో 20 కోట్ల విలువ చేసే 7 ఖరీదైన కార్లు ఉండేవట.

కానీ సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌తో పోల్చుకుంటే ఆయన సంపాదించిన ఆస్తులు చాలా తక్కువే అని ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయం. సెటిల్మెంట్స్, భూముల కొనుగోళ్లు, సైడ్ బిజినెస్ వంటి వాటిలో కృష్ణ దృష్టి ఉండేది కాదని.. నిత్యం సినిమాలు నిర్మిస్తూ .. సినిమానే ప్రపంచంగా ఉండేవాడని.. కీలక సమయంలో కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో కృష్ణ కోట్లాది రూపాయలు నష్టం వచ్చిందని.. ఆ సమయంలో అప్పులు తీర్చేందుకు తన పద్మాలయ స్టూడియో అమ్మేయాలని కృష్ణ అనుకున్నారని అంటారు. అయితే అంతలోనే మహేష్ బాబు టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నారు. తండ్రి అప్పులన్నీ మహేష్ బాబు తీర్చేసి.. మళ్ళీ కృష్ణ నిలబడేలా మహేష్ కష్టపడ్డాడట. ఏదేమైనా కృష్ణ మృతి తరువాత అప్పుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతుండటం విశేషం.