వివాహితతో యువకుడు పరార్, చెట్టుకు కట్టేసి.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

వివాహితతో యువకుడు పరార్, చెట్టుకు కట్టేసి.. (వీడియో)

May 17, 2019

వివాహితతో ఓ యువకుడి పరారయ్యాడు. వారి ఆచూకీ కోసం అష్టకష్టాలు పడిన సదరు మహిళ భర్త.. అఖరికి యువకుడిని పట్టుకుని, గ్రామస్తులతో కలిసి చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. కలకలం రేపుతున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మధ్యప్రదేశ్‌లో ధార్ గ్రామానికి చెందిన ఓ వివాహిత మరో యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త ఊర్లోవారందరితో కలిసి యువకుడిని పట్టుకున్నాడు. రాజీ చేసుకుందామంటూ యువకుడిని నమ్మించి, స్వగ్రామానికి రమ్మన్నాడు. అతని మాటలు నమ్మిన యువకుడు, అతని చెల్లెళ్లతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు.

అప్పటికే గ్రామస్తులందతరితో కాపుగాసిన మహిళ భర్త, యువకుణ్ణి, అతని చెల్లెళ్లను చెట్టుకు కట్టేసి చితకబాదారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు.. యువకుడు,అతని చెల్లెళ్లపై దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.