వీళ్ల ఫోన్ల పిచ్చి తగులెయ్య...మునిగిపోతుంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్ల ఫోన్ల పిచ్చి తగులెయ్య…మునిగిపోతుంటే..

June 27, 2017

 

ఫోన్ల పిచ్చి పీక్స్ కు చేరింది. సెల్ఫీలు, వీడియోలు పిచ్చిలో కొందరు తలతిక్క పనులు చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. స్నానం చేయడానికి నదిలోకి దిగిన ఓ వ్యక్తి ఈతరాక మునిగిపోతుంటే కాపాడాల్సింది పోయి వీడియో తీస్తుండిపోయారు అతని స్నేహితులు.

ఢిల్లీలోని అమన్‌ విహార్‌ ప్రాంతానికి చెందిన కుందన్‌ స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్‌లోని హృషికేశ్‌ వెళ్లాడు. కుందన్‌ స్నేహితులు రాఫ్టింగ్‌కి వెళ్లాలనుకున్నారు. కానీ అతను మాత్రం గంగా నదిలో పుణ్యస్నానానికి వెళ్తానన్నాడు. ఈ నేపథ్యంలో కుందన్‌.. తాను నదిలోకి దిగుతున్నప్పుడు వీడియో తీయమని స్నేహితులకి ఫోన్‌ ఇచ్చాడు. అతనికి ఈతరాకపోవడంతో తాడుపట్టుకుని నదిలో దిగాడు. స్నానమాచరిస్తుండగా కుందన్‌ ఒక్కసారిగా మునిగిపోయాడు.
అతను ఈత రాక అల్లాడిపోతుంటే స్నేహితులు మాత్రం వీడియో తీస్తూనే ఉన్నారు. దాంతో అతను ఉన్నట్టుండి పూర్తిగా మునిగిపోయాడు. దోస్తులు సోయి లేకుండా చేసిన పనికి విలువైన ప్రాణం గంగలో కలిసింది. కనీసం కేకలు వేసినా అక్కడ ఉన్నోళ్లు కాపాడేవారేమో…