Shocking Video Shows Sinkhole Opening Under Swimming Pool During Party, Dragging Man In
mictv telugu

స్విమ్మింగ్‌పూల్‌లో నోరు తెరిచిన నరకద్వారం.. వీడియో

July 28, 2022

అప్పటివరకూ ఆనందంగా గడిపిన ఆ పార్టీ వాతావరణమంతా విషాదాంతంగా మారింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఆడుతూ పాడుతూ ఈత కొడుతున్న వారంతా షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా అదిరిపడ్డారు. స్విమ్మింగ్‌పూల్ మధ్యలో అకస్మాత్తుగా ఏర్పడిన సింక్‌హోల్‌.. ఈత కొడుతున్న వ్యక్తిని మింగేసింది. ఆ వ్యక్తి అమాంతం సింక్‌హోల్ పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్‌ లాక్కెళుతున్న షాకింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్‌ నగరంలో గురువారం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కార్మీ యోసెఫ్‌లోని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో గ్రాండ్‌గా పార్టీ జరుగుతుంటుంది. ఉన్నట్లుండి ఆ స్మిమ్మింగ్ పూల్‌లో ఒక సింక్‌ హోల్‌ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఈత కొడుతున్న వారిలో ఒకరు సుమారు 43 అడుగుల లోతులోకి కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతాడు. స్మిమ్మింగ్ పూల్ ధ్వంసం కావడంతో పాటు అందులో ఈత కొట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులన్నీ నీటితో పాటు సింక్‌హోల్‌లోకి కొట్టుకుపోతాయి. కాగా ఈ ఘటన ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఇప్పటివరకు తెలియడం లేదు. అయితే భూగర్భ జలాల కారణంగా నేల కింది భాగం కరిగిపోయినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.