Shocking video: The black snake hiding under the chicken
mictv telugu

షాకింగ్ వీడియో : కోడి కింద దాక్కున్న నల్లపాము

May 13, 2022

కంటితో చూస్తే గానీ నమ్మలేని షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. సాధారణంగా మనం ఊళ్లల్లో చూసినట్టు పాములు కనబడితే కోళ్లు అలర్ట్ అవుతాయి. తమ గుడ్లను తింటుందేమోనన్న భయంతో వాటిపై తిరగబడతాయి. కానీ, ఇప్పుడు మనం వీడియోలో చూసే కోళ్లు మాత్రం పాముకు ఏమాత్రం భయపడకుండా తమ పొదుగు కింద షెల్టర్ ఇచ్చాయి. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. రెండు కోళ్లు తమ గుడ్లపై కూర్చుని వాటిని పొదుగుతున్నాయి. యజమాని వాటి వద్దకు వచ్చి ఓ కోడిని పైకి లేపి చూడగా, దానికింద దాక్కున్న విషపూరితమైన ఓ నల్ల పాము కనిపించింది.

మరో వింతేమిటంటే యజమాని ఆ పామును బయటకు తీద్దామని ప్రయత్నిస్తుంటే పక్కనున్న మరో కోడి యజమానికి ముక్కుతో గుచ్చడం. అయినా యజమాని పామును జాగ్రత్తగా బయటకి తీశాడు. తరచి చూడగా, ఆపాము ఓ గుడ్డును మింగి ఉంది. ఈ వీడియోను చూసిన చాలా మంది రకరకాలుగా తమ అనుమానాలను కామెంట్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? అని, పాము మళ్లీ వస్తుందనీ, పాము ఎందుకు కాటేయలేదని ప్రశ్నిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఆ యజమాని కోళ్లతో పాటు ఆ పామును కూడా పెంచుకుంటున్నారు. దీంతో పాము, కోళ్లు కూడా కలిసి పెరగడంతో వాటి మధ్య స్నేహం చిగురించిందని ఆయజమాని తెలపినట్టు సమాచారం.