షాకింగ్ వీడియో : బస్సు స్టీరింగుని యువతికిచ్చిన డ్రైవర్ - MicTv.in - Telugu News
mictv telugu

షాకింగ్ వీడియో : బస్సు స్టీరింగుని యువతికిచ్చిన డ్రైవర్

April 18, 2022

 

 bbbbbb

ప్రయాణీకులతో కూడిన బస్సును నడిపించే డ్రైవరు నిర్లక్ష్యంతో తన చేతిలోని స్టీరింగుని ఓ యువతి చేతిలో పెట్టాడు. జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో సంచలనంగా మారింది. ఉధంపూర్ జిల్లా కేంద్రం నుంచి లాండర్ మార్గంలో నడుస్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. పూర్తిగా లోయలు, కొండలు ఉన్న ఆ ప్రాంతంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బస్సు లోయలోకి పడిపోవడం ఖాయం. అలాంటి రూట్లో డ్రైవరు పక్కకు జరిగి అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చాడు. ఈ వీడియో బయటికి రావడంతో రవాణా శాఖ అధికారులు డ్రైవరుపై చర్యలు తీసుకున్నారు. బస్సును సీజ్ చేసి డ్రైవరు డ్రైవింగ్ లైసెన్స్, వాహనం పర్మిట్‌ను రద్దు చేశారు. డ్రైవరుపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.