కరోనాతో ప్రపంచం అతళాకుతలం అవుతోంది. దీన్ని అరికట్టేందుకు రకరకాల పద్దతులను పాటిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం తప్పనిసరి అయిపోయింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో కొన్నిసార్లు భౌతిక దూరం చాలా మంది పాటించడం లేదు. దీంతో ఇప్పటి వరకు ఎవరైనా క్యూ లైన్లలో ఉంటే గొడుగు తప్పనిసరి చేశారు. దీని వల్ల దూరం పెరగడంతో వైరస్ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. తాజాగా ఇలా సోషల్ డెస్టెన్సింగ్ షూలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రొమేనియాలో ఈ షూస్ కొనేందుకు జనం కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇటీవల అక్కడ లాక్డౌన్ సడలించడంతో జనం రోడ్లపైకి వచ్చారు. కానీ చాలా మంది భౌతిక దూరం పాటించడం లేదు. దీన్ని గమనించిన ట్రాన్సిల్వేనియాకు చెందిన గ్రిగర్ లుప్ వెరైటీ షూ తయారు చేశాడు. ఏకంగా ముందు భాగం పొడవుగా ఉండేలా తయారు చేశారు. యూరోపియన్ సైజు సంఖ్య 75లో రూపొందించాడు. దీని వల్ల జనం మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్ దూరం ఉంటుది. దీంతో జనం గుమిగూడే అవకాశం లేదని పేర్కొన్నాడు. కాగా గిగర్ లూప్ 2001 నుంచి లెదర్ బూట్లను తయారు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అదే దుకాణంలో ఈ బూట్లు విక్రయిస్తున్నాడు. వీటిని చూసిన వారంతా ఆలోచన బాగుందని ప్రశసిస్తున్నారు.