shoiab akthar Controversial coments on india vs southafrica match
mictv telugu

భారత్ కావాలనే ఓడిపోయిందంటున్న షోయబ్ అక్తర్

October 31, 2022

shoiab akthar Controversial coments on india vs southafrica match

టీ 20 వరల్డ్ కప్-2022 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రపంచ కప్ ను ముద్దాడేందుకు అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన జట్లతో పోటీగా పసికూనలు కూడా విజృంభించడం వరల్డ్ కప్ పోరు ఇంట్రెస్టింగా మారింది. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై టీం ఇండియా ఓటమి చవిచూసింది.సూర్యకుమార్ యాదవ్ మినహా టీం ఇండియా బ్యాటర్లు ఫెయిల్ అవ్వడం, పేలవ ఫీల్డింగ్ తో వరల్డ్ కప్ లో మొదటి ఓటమి నమోదు చేసింది..మొదటసారి భారత్ గెలవాలని ఎదురుచూసిన పాక్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండు ఓటములతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న పాక్…టీం ఇండియా ఓటమిని జీర్ణించుకోలేక తన అక్కసును వెళ్లగక్కుతోంది.

భారత్ ఓటమిపై పాక్ అభిమానులు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం కారుకూతలు కూస్తున్నారు..సౌతాఫ్రికాపై భారత్ కావాలనే ఓడిపోయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.. తమ జట్టు సెమీస్ కు వెళ్ళకుండా చేసేందుకే భారత్ ఆటగాళ్లు పేలవంగా ఆడారని మాట్లాడుతున్నారు.. ఆ దేశ మాజీ ఆటగాడు, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్ పై అసహనం వ్యక్తం చేసాడు. భారత్ బ్యాటింగ్ చేసిన సమయంలో అక్తర్ విడులచేసిన వీడియో వైరల్ గా మారింది.. పాకిస్థాన్ కోసం భారత్ గెలుస్తుందని నేను అశించాను.. కాని వారు పాక్ పతనం కోసం ఆడుతున్నారు.. ఇప్పటికే నాలుగు వికెట్లు పోగొట్టుకున్నారంటూ షోయబ్ అక్తర్ వీడియో పోస్ట్ చేసాడు.. ఈ వీడియోపై భారత్ అభిమానులు మండిపడుతున్నారు.సోషల్ మీడియా వేదికగా షోయబ్ అక్తర్ కు కౌంటర్స్ ఇస్తున్నారు..

ఇక పాక్ జట్టు సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి.. పాక్‌కు టెక్నికల్‌గా ఇప్పటికీ సెమీస్ చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ జట్టు టాప్-4లో నిలవడం దాదాపుగా కష్టమే. పాక్ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ.. భారత్, దక్షిణాఫ్రికా జట్లు చిత్తుగా ఓడితే తప్పితే పాకిస్థాన్ సెమీస్ చేరలేదు. సెమీస్ రేసులో సౌతాఫ్రికా ముందంజలో ఉండగా.. భారత్ తర్వాతి స్థానంలో ఉంది.