అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. గతకొన్నాళ్లుగా అమెరికాలోని వివిధ నగరాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో ఆరుగురిని కాల్చిచంపాడు హంతకుడు. దీనికి సంబంధించి ఓ అనుమాతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mississippi shooting: Six people killed in small rural town near Tennessee border https://t.co/5Pg918XJOz
— Sky News (@SkyNews) February 17, 2023
టేట్ కౌంటీలోని కాల్పులను మిస్సిస్సిప్పి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రతినిధి బెయిలీ మార్టిన్ ధృవీకరించారు. మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ కార్యాలయం తనకు కాల్పుల గురించి సమాచారం అందిందని వెల్లడించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఎందుకు కాల్పులకు పాల్పడ్డారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అర్కబుట్ల డ్యామ్ రోడ్డులో వాహనంలో అనుమానితుడిని గుర్తించిన టేట్ కౌంటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గురించి వివరాలు వెల్లడించలేదు.