మహేశ్ బాబుకు బుల్లెట్ ఫ్రూఫ్ సెక్యూరిటీ.. కశ్మీర్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ బాబుకు బుల్లెట్ ఫ్రూఫ్ సెక్యూరిటీ.. కశ్మీర్‌లో

November 6, 2019

మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. ఆర్టికల్ 370 రద్దు జరగడానికి ఒకరోజు ముందు కశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. అప్పటి షూటింగ్ గురించి చిత్ర సహ నిర్మాత అనిల్ సుంకర్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Sarileru Neekevvaru. 

కశ్మీర్‌ షూటింగ్‌ సమయంలో మహేశ్‌బాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘కశ్మీర్‌లో మా సినిమా చిత్రీకరణకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అనుమతి ఇచ్చారు. అదే సమయంలో మహేశ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ సెక్యూరిటీ ఇవ్వమని కోరాం. సెక్యూరిటీ మధ్యలో మహేశ్ షూటింగ్‌లో పాల్గొనేవారు. మహేశ్‌‌కు పహాల్గమ్‌కు చేరుకునేవారు కానీ, మిగిలిన చిత్రబృందానికి పహాల్గమ్‌కు అనుమతి ఉండేది కాదు. షూటింగ్‌ సమయంలో సెక్యూరిటీపరంగా మాపై చాలా ఆంక్షలు విధించారు. అప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం. తర్వాతే తెలిసింది అదంతా ఆర్టికల్ 370 గురించి అని. ఏదో విధంగా షూటింగ్ పూర్తిచేసుకున్నాం’ అని తెలిపారు. 

రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి  టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి ప్రొఫెసర్‌ భారతి పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 12, 2020న విడుదలకు సిద్ధం అవుతోంది.