హైదరాబాద్ శివారులో కాల్పులు.. రియల్టర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ శివారులో కాల్పులు.. రియల్టర్ మృతి

March 1, 2022

hyd

హైదరాబాద్ నగర శివారులో మంగళవారం కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి రాఘవేందర్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, గాయపడిన రాఘవేందర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి అల్మాస్‌గూడకు చెందినవాడుగా గుర్తించారు. రాఘవేందర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్ గాయమైందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా బాధితుడు అంబర్‌పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు.