యూట్యూబ్ హెడ్డాఫీసులో కాల్పుల మోత - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్ హెడ్డాఫీసులో కాల్పుల మోత

April 4, 2018

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయం కాల్పుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం 30 ఏళ్ల వయసున్న మహిళ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. నలుగురు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన మహిళ తర్వాత తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.  విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.భోజన సమయంలో దుండగురాలు క్యాంపస్‌లోని డాబాపైకి వచ్చి కాల్పులు ప్రారంభించింది. మొత్తం పది రౌండ్లు కాలల్చింది. ఇంటి గొడవలతో ఆందోళనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడిందని, ఇది ఉగ్రవాద దాడి కాదని పోలీసులు స్పష్టం చేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.