పట్టుదల అదుర్స్..వడగళ్ల వానలోనూ క్యూలో నిల్చున్న మందుబాబులు - MicTv.in - Telugu News
mictv telugu

పట్టుదల అదుర్స్..వడగళ్ల వానలోనూ క్యూలో నిల్చున్న మందుబాబులు

May 5, 2020

Shoppers brave hailstorm to buy liquor at a shop on Mall Road in Nainital

కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై సడలింపులు ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దాదాపు నెలన్నర తరువాత మద్యం దుకాణాలు ఓపెన్ అవుతుండడంతో మద్యంప్రియులు వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. 

ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వడగండ్ల వాన కురుస్తున్నా మద్యం ప్రియులు క్యూ లైన్ లో నిల్చున్నారు. నైనిటాల్‌లోని ఓ వైన్‌ షాప్ బయట ఈ సంఘటన జరిగింది. కొందరు గొడుగులతో వస్తే మరికొందరు రెయిన్‌కోట్‌లు వేసుకుని వచ్చారు. భారీ వర్షం పడుతోంది కస్టమర్లు వెళ్లిపోతారని వైన్ షాపు నిర్వాహకులు అనుకున్నారు. కానీ, ఎంత వర్షం కురిసినా మందుబాబులు వెనక్కు వెళ్ళలేదు. షాపు ఎదుట భౌతిక దూరం పాటిస్తూ సహనంతో నిల్చున్నారు. తమ వంతు వచ్చేదాకా ఆగి మద్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.