10 రూపాయలకే గర్ల్‌ఫ్రెండ్.. కీలక కండీషన్ ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

10 రూపాయలకే గర్ల్‌ఫ్రెండ్.. కీలక కండీషన్ ఇదే.. 

February 3, 2020

Shopping Complex.

ఒంటరిగా వచ్చే కుర్రాళ్ళ కోసం ఓ షాపింగ్ మాల్‌ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.10కే గర్ల్‌ఫ్రెండ్స్‌ని అద్దెకు పంపిస్తోంది. దీంతో ఆ షాపింగ్ మాల్‌కు యువకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆ షాపింగ్ మాల్ అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. రెండు నిమిషాలకి ఒక రూపాయి చొప్పున పది రూపాయలకు ఇరవై నిమిషాలు సదరు గర్ల్‌ఫ్రెండ్స్ అబ్బాయిలతో ఆ షాపింగ్ మాల్‌లో వారితో చనువుగా ఉంటారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో హ్యూవాన్ సిటీలో ది విటాలిటీ సిటీ షాపింగ్ కాంప్లెక్స్ ఈ విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది.

షాపింగ్‌కు వెళ్లే కొందరు యువకులు అమ్మాయి తోడుగా కావాలనుకుంటారు. వారి ఆసక్తిని గమనించిన సదరు షాపింగ్ మాల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. 20 నిమిషాలకు రూ.10 చెల్లిస్తే చాలు. అమ్మాయిలు అక్కడ పోడియం దగ్గర నిలబడి ఉంటారు. కస్టమర్లు ఎవరు నచ్చితే వారిని అద్దె చెల్లించి షాపింగ్ కోసం తోడుగా తీసుకెళ్లొచ్చు. కేవలం 20 నిమిషాలు మాత్రమే తోడుగా వస్తారు. సమయం దాటిందంటే వీళ్లు మళ్లీ పోడియం దగ్గరకు వచ్చేస్తారు.

ఇందుకోసం ఆ షాపింగ్ మాల్ 15 మంది యువతులు సిద్ధంగా ఉంచారు. యువకులే కాదు కాదు.. యువతులు కూడా ఈ అమ్మాయిలను షాపింగ్‌కు తోడుగా తీసుకెళ్లొచ్చు. షాపింగ్‌లో ఏవైనా అనుమానాలు వస్తే వీరి సాయం తీసుకోవచ్చు. వారు తోడుగా మాత్రమే కాదు షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం వంటి పనులు కూడా చేస్తారు. మరో కొసమెరుపు ఏంటంటే.. లంచ్, డేటింగ్ కోసం కూడా కస్టమర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లొచ్చు. అందుకోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదు.