షాపింగ్ కు  సతులతో పోటీ పడి పోతున్న...... పతులు - MicTv.in - Telugu News
mictv telugu

షాపింగ్ కు  సతులతో పోటీ పడి పోతున్న…… పతులు

July 15, 2017

భార్యలతో షాపింగ్ కు వెళ్లేందుకు భర్తల క్యూ…. ఇదేం వార్త ఇట్లా ఉంది అనుకోకండి. నిజంగానే ఇది నిజం. ఇంకా చెప్పాలంటే పచ్చి నిజం. నిజంలోకెల్ల నిజం. భార్యలతో షాపింగ్ అంటే సహజంగా భర్తలు దడుసుకుంటారు కదా. వీళ్లేందుకిట్లా చేస్తున్నారనే డౌట్ సహజంగానే వస్తుంది. అయితే భార్యలు, భర్తలు మన దేశం వాళ్లు అయితే కాదు. ఇంతకు విషయం ఏందంటే….

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు కాని. ఒక్క ఐడియా మాత్రం ఈ షాపింగ్ మాల్ కు ఎనలేని  క్రేజీని తెచ్చి పెట్టింది. పైగా ఉత్తపుణ్యానికి  పే…..ద్ద ప్రచారం కూడా తెచ్చింది. చైనాలోని షాంఘై పట్టణంల ఉన్న గ్లోబల్ హార్బర్  మాల్ వారు భార్యల వెంట వచ్చిన భర్తల కోసం…. గేమింగ్ రూంలు ఏర్పాటు చేశారు. వారు షాపింగ్ చేసేంత వరకు గేమింగ్ ఆడకుంటూ కూర్చుంటున్నారట.  ఒకటి రెండు కాదు 1990 రకాల గేమ్ లు ఉన్నాయట. కొన్ని చిన్న చిన్నం రూంలు ఏర్పాటు చేసి దాంట్లో కంప్యూటర్లు పెట్టారు. అంతే భార్యలు షాపింగ్  చేస్తుంటే భర్తలు హాయిగా ఆటలు ఆడుకుంటున్నారట. ఇట్లా చేసినప్పటి నుండి జనాలు షాపింగ్ చేయడానికి విపరీతంగా వస్తున్నారట. భర్తలు అయితే  భార్య ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నారట.

అయితే దాంట్ల ఫ్యాన్, ఎసీ సౌకర్యం లేక పోవడంతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామని… ఆలోచన మాత్రం భేష్ అని తెగ మెచ్చుకుంటున్నారట భార్యల వెంట వచ్చిన భర్తలు. మరిలాంటి ఆలోచన మన దగ్గర కూడా చేస్తే షాపింగ్ భార్యభర్తలు కలిసి హ్యాపీగా చేసుకోవచ్చేమో.