లవ్ ఫెయిల్యూర్ ఫిలింలో నటించి, పెళ్లయిన 3 రోజులకే ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

లవ్ ఫెయిల్యూర్ ఫిలింలో నటించి, పెళ్లయిన 3 రోజులకే ఆత్మహత్య

August 1, 2020

Short film Actress passed away three days after marriage

పెళ్ళైన మూడు రోజులకే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండపేట మండలంలోని వై సీతానగరంలో శుక్రవారం జరిగింది. మృతురాలు రమ్య శ్రీదేవి (20) కొన్ని రోజుల క్రితమే ‘డార్క్‌ వేలంటైన్’ అనే లవ్‌ ఫెయిల్యూర్‌ కథనాంశంగా రూపొందించిన హరర్‌ షార్ట్‌ ఫిలిమ్‌లో హీరోయిన్ గా నటించింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఆగష్టు 2న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకానికి వెళ్ళింది. 

రమ్య శ్రీదేవి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన మేనమామతో బుధవారం రమ్య శ్రీదేవి పెళ్లి అయింది. శనివారం ఆమె లక్ష్మణ ఈశ్వరం ఇంటికి వెళ్లాల్సి ఉంది. కాగా, శుక్రవారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా… ఫలితం లేకపోయింది. తహసీల్దార్‌ సీహెచ్‌ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. ఇష్టం లేని పెళ్లి కావచ్చని, లేదా చదువు ఆగిపోతుందన్న బాధతోనైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.