కొంపముంచిన పోస్ట్: కష్టాల్లో హ్యుందాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

కొంపముంచిన పోస్ట్: కష్టాల్లో హ్యుందాయ్

February 7, 2022

hhhhh

భారతదేశంలో 25 సంవత్సరాలుగా అత్యాధునిక డిజైన్‌లతో కార్లను తయారు చేస్తూ, అభివృద్ది బాటలో నడుస్తున్న హ్యుందాయ్ సంస్థ కష్టాలో పడింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 5న పాకిస్థాన్ నిర్వహించే సంస్మరణ దినం సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ సోషల్ మీడియా వేదికగా ‘కశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందాం. స్వాతంత్ర్యం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దాం’ అని పెట్టిన పోస్ట్‌కు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా హ్యుందాయ్ కార్ల కంపెనీని భారతదేశం నుంచి బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ‘BoycottHyundai’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ చేస్తున్నారు. కశ్మీర్ వేర్పాటు వాదులకు మద్దుతిచ్చేలా, ఆ పోస్ట్ ఉందంటూ దుమారం రేగడంతో, గమనించిన హ్యుందాయ్ ఆ పోస్ట్‌ను తొలగించింది. అయినప్పటీకి కొంతమంది దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో చక్కర్లు కొడుతుంది. భారతదేశానికి కంపెనీ క్షమాణలు చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.