2 నెలలకోసారి ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హరీశ్ డిమాండ్  - MicTv.in - Telugu News
mictv telugu

 2 నెలలకోసారి ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హరీశ్ డిమాండ్ 

October 12, 2020

Shortage of income It has to be given for 2 months .. Harish rao demand to the center

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 42వ జీఎస్టీ ‌ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది. ఈ ‌కౌన్సిల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. బీఆర్కె భవన్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు  ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ‌ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహార నిధి నుంచే ఈ పరిహారాన్ని చెల్లించాలని అన్నారు. మరోవైపు సెస్‌తో పాటు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమ చేయాలని తెలిపారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద పెర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోందని చెప్పారు. ఈ విషయమై జీఎస్టీ కౌన్సిల్ చర్చించ వచ్చని పేర్కొన్నారు. 

ఆప్షన్ 1లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్షా పది వేల కోట్లకు, ఆప్షన్ 2లో‌ లక్ష 83 వేల కోట్లకు రివైజ్డ్ చేయడం జరిగిందని వివరించారు. వీటి మధ్య అంతరం 73 వేల కోట్లు మాత్రమేనని.. ఇదేమి పెద్ద మొత్తం కాదని వెల్లడించారు. ‘ఆప్షన్ 1లో పేర్కొన్న పరిహారంతో పాటు ఈ 73 వేల కోట్లు చెల్లించాలి. ఛత్తీస్‌గఢ్ మంత్రి చెప్పినట్లు జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదు. దీన్ని నేను కూడా సమర్థిస్తున్నాను’ అని హరీశ్ రావు స్పష్టంచేశారు.