రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. నగరమంతటా పరిస్థితి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారా?. హైదరాబాద్ లో కూడా శ్రీలంకలాంటి పరిస్థితులు వచ్చాయా అంటూ విమర్శిస్తున్నారు. సిటీలోని మొత్తం 30 శాతం పెట్రల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు… దగ్గరలో ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అనుకుంటూ రోడ్ల మీదే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల బంకుల ముందుక వాహనదారులు బారులు తీరారు. అయిల్ కంపెనీలు వాస్తవ కోటాకు 25శాతం కోత విధించడం అదే సమయంలో క్రెడిట్ విధానాన్ని రద్దు చేయటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. ఇక ఈ క్రెడిట్ విధానం రద్దు కావటం కొంత ఇబ్బందికరంగా మరిందని డీలర్లు చెబుతున్నారు.
ముందు డబ్బు చేల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు డబ్బులు చెల్లించినా కోటాలో 75శాతం మాత్రమే సరఫరా చేస్తున్నట్లు డీలర్లు వాపోతున్నారు. తమకు అన్యాయం జరుగుతూనే ఉంది కాబట్టి డీలర్ల దగ్గర డీజిల్ కొనుగోలు చేయమని పెట్రోల్ బంకుల నిర్వహకులు అంటున్నారు.