గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పీడియాక్ట్ కేసులో అరెస్టయిన రాజాసింగ్ కు హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన రాజాసింగ్… ఓ సామాజిక వర్గంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంగళవారం మంగళ్‌హాట్ పోలీసులు షోకాజ్ నోటీసు జారీచేశారు ఇవాళ ఫేస్ బుక్ లో రాజా సింగ్ చేసిన ఓ పోస్ట్ రెచ్చ గొట్టేలా ఉందంటూ మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఫేక్బుక్లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కింద.. తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టారు రాజాసింగ్. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఆ కామెంట్ ఓ మతాన్ని కించపరిచినట్టు ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా.. ఇప్పటికే రాజాసింగ్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఆయన పెట్టిన కామెంట్‌ను పరిగణలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించట్లేదని మరోసారి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించగా అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించి విడుదలయ్యారు. ఆ సందర్భంగా బహిరంగంగా కానీ, సోషల్ మీడియాలో కానీ విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించారంటూ పోలీసులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రెండు రోజుల్లో షోకాజు నోటీసుకు సమాధానం ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.