జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ కచేరీ ప్రదర్శలలో నోట్ల వర్షం కురిసింది. కళాకారుల ప్రదర్శనకు అభిమానులు భారీగా విరాళాలు అందించారు. ఇటీవల గుజరాత్లోని నవరాసి గ్రామంలో కీర్తిదాన్ గాధ్వీ భజనకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద నేత్రాలయం ట్రస్టు ఆధ్వర్యంలో నూతన కంటి ఆసుపత్రి నిధుల సేకరణ కోసం ఈ భజనా కార్యక్రమాన్ని నిర్వహించారు. నవసారిలోని సుపా గ్రామంలో ఇది జరిగింది. కీర్తిదాన్ గాధ్వితో పాటు మరో జానపద గాయని ఊర్వశి రద్దియా తమ ప్రదర్శనలతో అభిమానులను అలరించారు.
మూడు రోజులుగా సాగిన కార్యక్రమంలో ప్రతీ రోజు వందలాది మంది 10, 20, 50, 100, 500 రూపాయల నోట్ల వర్షం కురిపించారు. జల్లు కురిసిన నోట్ల మొత్తం విలువ 50 లక్షల రూపాయలకు ఉన్నట్లు గాధ్వీ తెలిపారు. సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి