సైనా నెహ్వాల్ బయోపిక్... సాహూ హీరోయిన్ అవుట్ - MicTv.in - Telugu News
mictv telugu

సైనా నెహ్వాల్ బయోపిక్… సాహూ హీరోయిన్ అవుట్

March 15, 2019

దేశంలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ సినీ.. రాజకీయ.. క్రీడాకారుల జీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమా రూపొందుతుందని గతంలో వార్తలు వచ్చాయి. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సైనా బయోపిక్ నుంచి శ్రద్ధ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా చిత్రీకరణ సమయంలో శ్రద్ధకు డెంగ్యూ జ్వరం రావడంతో ఆమె అనుకున్న తేదీల్లో చిత్రీకరణ జరిగే అవకాశం లేని కారణంగా ఆమెను సినిమా నుంచి తప్పుకున్నట్టు సినిమా నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు. శ్రద్ధ కపూర్ స్థానంలో మరోనటి పరిణితి చోప్రాను తీసుకున్నట్టు తెలిపారు.

Shraddha Kapoor Opts Out of Saina Nehwal Biopic, Parineeti Chopra to Replace Her Report

‘సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించబోతున్న పరిణీతి చోప్రాకు స్వాగతం’ అని పేర్కొంటూ పరిణీతి ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ సినిమా కోసం శ్రద్ధ కపూర్.. సైనా కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్‌లో మెళకువలు కూడా నేర్చుకున్నారు. ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. సినిమాను ఈ ఏడాదిలోనే పూర్తిచేసి 2020 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు నిర్మాత భూషణ్‌కుమార్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అమోల్‌ సేన్‌ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.