Shraddha Murder Case: for Aftab’s narco test.
mictv telugu

ఢిల్లీ కిల్లర్‌కు నార్కో టెస్ట్

November 16, 2022

ఢిల్లీ కిల్లర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు పోలీసులు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయబోతున్నారు. నిందితుడు చెబుతున్న విషయాలు నిజమేనా అని తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేయనున్నారు. శ్రద్ధాను చంపేందుకు వాడిన కత్తి పోలీసులకు దొరకలేదు. ఆమె ఫోన్ ఏమైందో నిందితుడు చెప్పడం లేదు. ఈ విషయాల్ని తెలుసుకునేందుకు పోలీసులు నార్కో టెస్ట్ నిర్వహించనున్నారు.

క్లూ కోసం కష్టాలు

సహజీవనం చేస్తున్న శ్రద్ధావాల్కర్‌ని అఫ్తాబ్ అమీన్ పూనావాలా దారుణంగా చంపేశాడు. 35 ముక్కలుగా చేసి ఢిల్లీ అటవీ ప్రాంతాల్లో పడేశాడు.ఆర్నెళ్లు ఫ్రీజ్‌లో ఉంచి రోజుకోచోట శ్రద్ధా శరీర భాగాల్ని పడేశాడు. స్పాట్లకు వెళ్లిన పోలీసులు..కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. పొత్తికడుపు, వెన్నెముక చివరిభాగాలు సేకరించారు. ఇంకొన్ని పార్ట్స్ దొరకలేదు. ఫ్లాట్‌లోని కిచెన్‌లో రక్తమరకల్ని గుర్తించారు. ఆధారాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆమెను చంపేందుకు వాడిన కత్తి ఎక్కడో ఉందో తెలియదు. శ్రద్ధా ఫోన్ కూడా ఏమైందో అఫ్తాబ్ చెప్పడం లేదు.

నిజం ఎంత ఉందో

ఢిల్లీ మర్డర్ కేసులో విచారణ వేగంగా జరగుతోంది. క్లూ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రద్ధా హత్యకేసులో ఇప్పటిదాకా సరైన ఆధారాలు లభించలేదు. విచారణ సమయంలో హంతకుడు అఫ్తాబ్ తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అతను చెప్పే దాంట్లో నిజం ఎంతో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం నార్కో టెస్ట్ పర్మిషన్ కోసం సాకేత్ కోర్టుకెళ్లారు. అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ పరీక్షలు నిర్వహించేందు కోర్టు అనుమతి ఇచ్చింది.

లోతుగా విచారణ

ఈ కేసులో లోతుగా విచారణ చేసేందుకు పోలీసులు నార్కో టెస్ట్ నిర్వహించనున్నారు. నిందితుడి మానసిక స్థితి ఎలా ఉందో తేల్చనున్నారు. శ్రద్ధా ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆమెను ముక్కలు చేసేందుకు వాడిన కత్తిని ఎక్కడ దాచాడో పోలీసులు నార్కో టెస్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అఫ్తాబ్ మానసిక స్థితి సరిగ్గా లేకుంటే అప్పుడు ఏం చేయాలో పోలీసులు ఓ నిర్ణయం తీసుకుంటారు.

శ్రద్ధా తండ్రి డీఎన్ఏ సేకరణ

దొరికిన పార్ట్స్ శ్రద్ధావేనని నిర్దారించేందుకు పోలీసులు ఆమె తండ్రి డీఎన్ఏ సేకరించనున్నారు. త్వరలో అతన్ని నుంచి బ్లడ్ అండ్ బోన్స్ శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.

గతంలో నలుగురికి పరీక్షలు

గతంలో ఢిల్లీ పోలీసులు ఇజ్రాయిల్ ఎంబసీ బ్లాస్ట్ కేసులో నలుగురు నిందితులకు నార్కో పరీక్షలు చేశారు. ఈ పరీక్షల ద్వారా వాళ్లు సగం నిజాలే చెప్పినట్లు గుర్తించారు. అందుకే ఢిల్లీ కిల్లర్‌కు పరీక్షలు చేయబోతున్నారు.