Shree Ram Navami :Lord Rama Favourite Prasadam Panakam,Vadapappu Prasadam
mictv telugu

Sri Rama Navami 2023: శ్రీరాముడికి ఎంతో ప్రీతికరమైన పానకం,వడపప్పు ప్రసాదాల విశిష్టత ఇదే.

March 28, 2023

Shree Ram Navami Special :Lord Shree Rama Favourite Prasadam Panakam,Vadapappu Prasadam

శ్రీరామనవమి వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈఏడాది మార్చి 31వ తేదీని శ్రీరామనవమిని జరుపుకోనున్నారు. శ్రీరామనవమి రోజున చేసే ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రసాదాల్లో ముఖ్యమైనవి పానకం, వడపప్పు. ఈ ప్రసాదాల వెనక ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం తయారు చేసి రాములవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

శ్రీరామనవమి పండగ ఎంత విశిష్టమైందో..శ్రీరామునికి సమర్పించే నైవేద్యంగా కూడా అంతే విశిష్టమైంది. ఆరోగ్యాలను ఇచ్చే ఈ ప్రసాదాల్లో ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం. శ్రీరామనవి వేసవిలో వస్తుంది. కాబట్టి శ్రీరాముడిని పూజించిన తర్వాత కొత్త కుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నేవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెడతారు.

భగవంతుడిని నివేదించే ప్రసాదాలు అన్నీ కూడా సమాయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. ఆరోగ్యానికి మంచిది అంటే తినము కానీ..ప్రసాదం అని చెప్పగానే కళ్లకు అద్దుకుని మరీ తింటుంటారు. అందుకే కావచ్చు మన పూర్వీకులు ఇలా పండగలను వేడుకగా నిర్వహించడం వేనకున్న రహస్యం.

శ్రీరామనవమిలో ముఖ్యమైన ప్రసాదం పానకం. ఈ పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు, వసంతరుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాదు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. పానకం అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైందని పండితులు చెబుతున్నారు.

ఇక వడపప్పు పెసరపప్పుతో తయారు చేస్తారు. పెసరపప్పును నానబెట్టి దాంట్లో మామిడికాయ తురుము వేసి కలుపుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చలవను పెంచుతుంది. జీర్ణశక్తిని క్రమబద్ధీకరిస్తుంది. శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది. పానకం తయారీలో ఉపయోగించే యాలకులు, మిరియాలు, బెల్లంతోపాటు శొంఠి, తులసి ఆకులు, పచ్చకర్పూరం కూడా వేసి తయారు చేశారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి.