Shriya Saran spends quality time with her daughter Radha in Tuscany
mictv telugu

కూతురు రాధతో కలసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రియా

September 8, 2022

ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రియా శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటింది. టాలీవుడ్ టాప్ హీరోస్‌తో వరుస సినిమాలు చేస్తూ.. కొంతకాలం గ్యాప్ తీసుకుంది. 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల రాజమౌళి ఆర్ఆర్ఆర్ లోనూ కీలకపాత్రలో నటించింది.

ప్రస్తుతం శ్రియా తన కూతురుతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. తన కూతురు రాధ, భర్త ఆండ్రీ కొస్చీవ్‏తో కలిసి శ్రియా టుస్కానీ పర్యటనలో ఉంది. తన కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్.. వీడియోస్ ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. నేను ఈ టుస్కానీలోని సూర్యకాంతిని కెమెరాలో బంధించాను. అవి మీకు జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. మీరోజును మరింత ప్రకాశవంతం చేస్తాయని ఆశిస్తున్నాను అంటూ తన భర్త తీసిన ఫోటోస్ షేర్ చేసుకుంది శ్రియా. అయితే ఎప్పుడు తన కూతురు ముఖం చూపించకుండా దాచేస్తున్న శ్రియా.. ఈసారి తన కూతురు ముఖాన్ని రివీల్ చేసింది.