బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజలు కలిసి చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ వాల్తేర్ వీరయ్య. ఈ మెగా సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక. ఈ రోజు సాయంత్రం వైజాగ్ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి శ్రుతి హాసన్ హాజరవుతారని అంతా భావిస్తున్నారు. కానీ తాజాగా శ్రుతి హాసన్ మెగాస్టార్ కి షాక్ ఇచ్చింది. మొన్న ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రుతి హాసన్. సభ వేదిక పైనుండే జై బాలయ్య అంటూ లక్షల మంది నందమూరి ఫ్యాన్స్ కి ఉత్సహాన్ని ఇచ్చింది. అయితే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా శ్రుతిహాసన్ నుండి ఇలాంటి పవర్ ఫుల్ స్పీచ్ ఆశించిన మెగా క్యాంప్ కి షాక్ ఇస్తూ డుమ్మా కొట్టేయనుంది.
తానూ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి రావటం లేదని స్వయంగా శ్రుతిహాసన్ తెలియజేసింది. అనారోగ్య కారణంగా గైర్హాజరవుతున్నట్టు ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది శ్రుతి హాసన్. `నా అనారోగ్యం కారణంగా `వాల్తేరు వీరయ్య` గ్రాండ్ లాంచ్ కు హాజరుకానందుకు నేను చాలా హార్ట్ ఫుల్ గా బాధపడుతున్నాను. నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను. ఈ రోజు రాలేకపోతున్నాను“ అని తెలిపింది. అయితే శ్రుతి హాసన్ సడెర్న్ గా వేడుకకి డుమ్మా కొట్టడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చీరకట్టులో గ్లామరస్ లుక్ తో నందమూరి అభిమానులను మురిపించిన శ్రుతిహాసన్.. కావాలనే మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిందని అంటున్నారు. జై బాలయ్య అని అరిచి తానూ ఎవరి వర్గమో చెప్పకనే శ్రుతి హాసన్ చెప్పేసిందని కొందరు డై హార్డ్ మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా వీరయ్య ఈవెంట్ కి శ్రుతిహాసన్ మిస్సవుతుండడం నిజంగా మెగాభిమానులకు నిరాశ కలిగించే అంశమే. చూద్దాం మరి మరో హీరోయిన్ కేథరిన్ శృతి లోటుని కవర్ చేస్తుందేమో..!