బాలీవుడ్ హీరో సంచలనం.. స్వలింగ సంపర్కుడిగా..  - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ హీరో సంచలనం.. స్వలింగ సంపర్కుడిగా.. 

January 20, 2020

Ayushman Khurana.

చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లు లిప్ లాక్ పెట్టుకోగా చూశాం. కానీ ఓ సినిమాలో మాత్రం ఇద్దరు హీరోలు లిప్ లాక్ కిస్ పెట్టుకుంటున్నారు. ఆశ్చర్యంగొలుపుతున్న ఈ సన్నివేశం సోమవారం విడుదల అయిన ‘శుభ్‌మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ సినిమా ట్రైలర్‌లో ఉంది. ఇద్దరు హీరోలు లిప్ లాక్ అనగానే మీకు గే సినిమా అని అర్థం అయి ఉంటుంది. నిజమే ఈ సినిమా గేల కథాంశంతో రూపొందింది. ఇందులో హీరోయిన్ ఉండదు. ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారడం, ఓవైపు సమాజం, మరోవైపు ఇంటి నుంచి వారు ఎదుర్కున్న పరిస్థితులేంటో ఈ చిత్రంలో చూపించనున్నారట. స్వలింగ సంపర్కులుగా ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్‌‌లు నటించారు. 

హితేశ్‌ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమా కార్తీక్‌ సింగ్‌, అమన్‌ త్రిపాఠిల ప్రేమకథగా రూపొందుతోంది. కామెడీతో పాటు సామాజిక సందేశం కూడా ఈ చిత్రంలో ఉంది అంటున్నారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా తరహా ట్రైన్‌సీన్లు.. అమ్మాయితో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుని అమన్‌.. కార్తీక్‌ కోసం పరిగెత్తుకు రావడం వంటి సీన్లతో ట్రైలర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విక్కీ డోనర్‌, అంధాదున్‌, బదాయి హో, బాలు వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో మెరుస్తున్నాడు. ఫిబ్రవరి 21 విడుదల అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.