Shubham Kaushal cut a 10 kg samosa on his birthday in meerut
mictv telugu

బర్త్ డే పార్టీలో కేక్ బదులు సమోసా.. తింటే భారీ బహుమతి

November 22, 2022

Shubham Kaushal cut a 10 kg samosa on his birthday in meerut

సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో ఎవరైనా కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య కేక్ కట్ చేస్తుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్ మీరట్ కి చెందిన ఓ వ్యాపారి మాత్రం బాహుబలి సైజులో సమోసా తయారు చేయించి కట్ చేశాడు. దీని బరువు పది కేజీలు ఉండడం గమనార్హం.

అనంతరం సమోసాను ముక్కలుగా చేసి బంధుమిత్రులకు పంచి సంతోషాన్ని పంచుకున్నాడు. సమోసా తయారీ కోసం నాలుగు కేజీల ఆలుగడ్డలు, బఠానీలు, పన్నీర్, జీడిపప్పులు వాడి ఆరుగంటలు శ్రమపడి తయారు చేశారు. దీన్ని గిన్నీస్ బుక్కులో నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వ్యాపారి శుభమ్ కౌశల్ తెలిపారు. అంతేకాక, ప్రజలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఈ బాహుబలి సమోసాను 51 నిమిషాల్లో తిన్నవారికి నగదు బహుమతిగా 71 వేల రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించాడు.