ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటివన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో (149 బంతుల్లో 208) రాణించాడు. ఈ క్రమంలో కోహ్లీ, ధావన్‌లను వెనక్కినెట్టాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్సులలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. కోహ్లీ, ధావన్‌లు 24 ఇన్నింగ్సులలో వెయ్యి పరుగులు చేస్తే గిల్ కేవలం 19 ఇన్నింగ్సులలోనే ఆ ఫీట్‌ను సాధించాడు.
Bowled! Santner beats Kohli to silence the stadium #INDvNZ pic.twitter.com/T9rB2o1p0P
— Ritwik Ghosh (@gritwik98) January 18, 2023
ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో పాక్ ఆటగాడు ఫఖర్ జమాన్ (18 ఇన్నింగ్స్) ఉన్నాడు. అటు భారత బ్యాటింగ్ ముగిసింది. మొత్తం 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి కివీస్‌కి 350 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ శిప్లే, మైకేల్ చెరు 2 వికెట్లు, ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు.
Out or Not Out?#IndvNz#HardikPandya𓃵 #notout pic.twitter.com/Hbzzwan4bs
— Rahul Sisodia (@Sisodia19Rahul) January 18, 2023