టీమిండియా న్యూ యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. జనవరి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ దక్కించుకున్నాడు. ఈ అవార్డుకు హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు న్యూజిలాండ్ ఓపెనర్ దేవాన్ కాన్వే కూడా పోటీ పడినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన గిల్ అవార్డును ఎగరేసుకుపోయాడు. సిరాజ్ గట్టి పోటీ ఇచ్చి కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఇక జనవరిలో రెచ్చిపోయిన 23 ఏళ్ల గిల్ మొత్తంగా ఆ నెలలో 567 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండగా, ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అయితే భీకర ఫాంలో ఉన్న గిల్‌ని నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో చోటివ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. కేఎల్ రాహుల్ కోసం గిల్‌ను పక్కన పెట్టగా రాహుల్ రాణించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఈ అవార్డును ఇంతకుముందు విరాట్ కోహ్లీ అక్టోబర్ 2022లో అందుకున్నాడు. మూడేళ్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ కోహ్లీ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచులో సెంచరీ చేసి సూపర్ ఫాం తిరిగి సాధించాడు.