ఐసీసీ ఈవెంట్లలో వరుస ఓటముల తర్వాత భారత క్రికెట్ ప్రక్షాళనకు బీసీసీఐ నడుం బిగించింది. జట్టులో అనేక మార్పులు చేస్తూ దేశవాళీ, ఐపీఎల్ మ్యాచులలో మంచి ప్రతిభ కనబరిచిన యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా సీనియర్లకు విశ్రాంతినిస్తూ జట్టుకు యువ రక్తాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా స్వదేశంలో శ్రీలంకతో జనవరి 3న ముంబైలో జరిగే టీ20 సిరీస్ కి కొత్త ఓపెనర్లను బరిలోకి దింపుతోంది. బంగ్లాదేశ్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కి జోడీగా శుభ్ మన్ గిల్ తొలిసారిగా టీ20ల్లో ఆరంగ్రేటం చేయనున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కి ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక సంచలన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ షోయబ్ అక్తర్ రికార్డుపై కన్నేశాడు. అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డు అక్తర్ పేరిట ఉంది. 2003 ప్రపంచ కప్ ఇంగ్లాండుతో మ్యాచులో అక్తర్ 161 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. తాజాగా దాన్ని బద్ధలు కొడతానని ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతా సవ్యంగా జరిగితే అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తానని, కానీ వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించాడు. బౌలింగ్ చేసేటప్పుడు ఎంత వేగంతో బాల్ విసురుతున్నామో మనకు తెలియదని, కానీ బాల్ ఎక్కడ పడుతుందనేది ముఖ్యమని తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
ఏం గిరాకీ రా బాబు.. నెల రోజులకే మూతపడిన కిర్రాక్ ఆర్పీ కర్రీ పాయింట్
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కు మరోసారి చుక్కెదురు
గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే జైలు జీవితం ఖాయం