పుల్లెల గోపిచంద్ అకాడమీలో కరోనా టెన్షన్.. షట్లర్ సిక్కిరెడ్డికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

పుల్లెల గోపిచంద్ అకాడమీలో కరోనా టెన్షన్.. షట్లర్ సిక్కిరెడ్డికి పాజిటివ్

August 14, 2020

Shuttler Sikki Reddy Tests Corona Positive

హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రతిరోజూ షెటిల్ ఆట ప్రాక్టీస్ చేస్తున్న ఆమెతో పాటు, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్‌కు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో అకాడమీని పూర్తిగా శానిటైజేషన్ చేశారు. కొన్ని రోజుల పాటు మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా వారికి వ్యాధి నిర్ధారణ కావడం అందరిని టెన్షన్ పెడుతోంది. 

రత స్పోర్ట్స్ అథారిటీ  నిబంధనల ప్రకారం శిక్షణ తీసుకునే ఆటగాళ్లు కచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే గోపిచంద్ అకాడమిలోని ఆటగాళ్లు పీవీ సింధు,  కోచ్‌ గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌, సిక్కిరెడ్డి, ఫిజియో థెరపిస్ట్ కిరణ్‌ సహా 20 మందికి పరీక్షలు జరిపారు. మిగిలిన వారందరికి నెగిటివ్ రాగా.. ఈ ఇద్దరిలో మాత్రం వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కాగా దాదాపు 5 నెలల తర్వాత శిక్షణ శిబిరం ప్రారంభమైన కొన్ని రోజులేక మళ్లీ మూతపడింది. మరోవైపు పీవీ సింధు కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తుండటంతో ఆమె టెన్షన్ పట్టుకుంది. క్యాంపు సజావుగా సాగేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామ కోచ్ వెల్లడించారు.