శ్యాంప్రసాద్ రెడ్డి..అప్పడు/ఇప్పుడు...! - MicTv.in - Telugu News
mictv telugu

 శ్యాంప్రసాద్ రెడ్డి..అప్పడు/ఇప్పుడు…!

June 27, 2017

తలంబ్రాలు,ఆహుతి ,అంకుశం ఈ పేర్లు వింటుంటే.. ఆహా ఆ సినిమాలు తీసిన నిర్మాత ఎవరో కానీ దండం పెట్టాలి అన్పిస్తుంది కదా,సమాజం పట్ల ఎంత గౌరవం,ఆడవాళ్లంటే ఎంత గౌరవం..కుటుంబ ప్రేక్షకులమీద ఎంత మమకారం, నిర్మాత అంటే గిట్లుండాలే అని అన్పిస్తుంది,ఆ సినిమాలు తీసింది ఎవరో కాదు,పటాస్ జబర్ధస్త్ లాంటి  బూతు ప్రోగ్రాంలకు పెబ్బ,పైసల నిర్మాత అయిన..శ్యాంప్రసాద్ రెడ్డి గారే..

ఇప్పుడు బాహుబలి అసొంటి సినిమాల్లో వందల కోట్లు వెట్టి గ్రాఫిక్స్ చేస్తే ..మనం చూసి ఆహా అంటున్నాం కానీ..ఆరోజుల్లోనే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మోరు, అంజి ,అరుంధతి వంటి సినిమాల్తో అద్బుతమైన గ్రాఫిక్స్ ని సృష్టించారు.గతంలో ప్రేక్షకులు అందరూ అబ్బ..శ్యాంమ్ ప్రసాద్ రెడ్డి గారు ఏం సినిమా తీశాడ్రా అని మెచ్చుకునేవారు,ఆయన నిర్మాణంలో సినిమా ఎప్పుడస్తుందా అని ఎదురు చూసేవారు.

అప్పుడు ఆడవాళ్ల మీదున్న గౌరవం…ఇప్పుడేమైంది..?

గతంలో కుటుంబమంతా కలిసి చూడతగ్గ చిత్రాలు,ఆడ ప్రేక్షకులను ఆకర్షించే చిత్రాలు నిర్మించిన శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమైంది ?విలవలను మరచి కంప్లీట్ బూతు వైపు ఎందుకు టర్న్ అయ్యారు?మల్లెమలా  ప్రొడక్షన్స్ ను స్టార్ట్ చేసి  ఈటీవీవీలో ఆడవాళ్ళను కించపరిచే విధంగా ప్రోగ్రామ్స్  ఎందుకు చేస్తున్నారు ? సినిమా అనేది వ్యాపారమైనా …డబ్బు కోసం సినిమాలు తీసి సమాజాన్ని చెడగొట్టే నైతిక హక్కు నిర్మాతకు లేదంటూ చెప్పి…నీతివంతమైన సినిమాలు ఎన్నో తీసిన నిర్మాత ఎమ్మెస్‌రెడ్డి గారి కొడుకే ఈ శ్యాం ప్రసాద్ రెడ్డి. మరి తండ్రి పాటించిన విలువలను శ్యాం ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు మరిచారు?

శ్యాం ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ సినిమాలు…

ముప్పై ఏండ్లకిందట వచ్చిన తలంబ్రాలు సినిమాతో శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నిర్మాతగా పరిచయమయ్యారు, తెలుగుసినిమాకు మంచి అభిరుచి ఉన్న నిర్మాత దొరికాడురా అని అందరూ అనుకునేంత మెప్పించాడు,ఆ తర్వాత ఆహుతి,అంకుశం  సినిమాలు కూడా మంచి సినిమాలుగా మంచి విజయాలు సాధించాయి…ఇగ ఆతర్వాత వచ్చిన అమ్మోరు అయితే దాని గురించి చెప్పాల్సిన అవుసరంలేదు…ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. ఆ సినిమాతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు,ఆ తర్వాత వచ్చిన అంజి కొంచెం నిరాశ పరిచినా అందులో ఉన్న గ్రాఫిక్స్ చూసినవారందరు నోరెళ్ల బెట్టారు…అరుంధతీ  సినిమా అయితే ఒక అద్బుతం అనే చెప్పచ్చు.కోడిరామకృష్ణ,శ్యాం ప్రసాద్ రెడ్డి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారు.ఆయన నిర్మించిన సినిమాల్లొ దాదాపు అన్నీ ఆడవాళ్లకే ఎక్కో కనెక్ట్ అయ్యే సినిమాలే.

విలువలు మరచిన  మల్లెమాల…

ఆడవాళ్లను తిడితేనో,లేకపోతే వాళ్లమీద పంచ్ పడితేనో  ప్రోగ్రామ్స్ హిట్  అన్న స్టాటజీతో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది మల్లెమాల ప్రొడక్షన్స్..వీటికి ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ,పటాస్ షోలను చూస్తే అర్ధమవుతుంది,పంచ్ లే కాదు యాంకర్ల డ్రెస్సులు డబల్ మీనింగ్ డైలాగులు..వెకిలి నవ్వులు కావేవి ప్రోగ్రాంకు అనర్హం అన్నట్టు…ఆడవాళ్లనే మూలధనం చేస్కొని  టిఆర్ పి రేటింగులు పెంచుకుంటున్నారు.పటాస్ షో లోనైతే ఇంకా ఘోరం బూతుతో పాటు చక్కగా అభినయించి  ముట్టుకొని పట్టుకొని…చీచీ ఆ దరిద్రాన్ని చెప్పేకంటే సప్పుడుదాక ఊకుంది బెటర్,చెప్పడానికే మాకు మాటలు రావడంలేదు ఇక ఆ ప్రోగ్రాం చూసే ఫ్యామిలీ  ఆడియన్స్ పరిస్ధితి ఏంటో మీరే అర్ధంచేస్కోండి.

ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి చూసే మాద్యమంగా టీవీ ఉండేది,ఇప్పుడు జబర్ధస్త్ పటాస్ లాంటి షోలు వస్తున్నాయంటే ఒక ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది..అందులో ఏఏం బూతులు వినాల్సివస్తుందో అని, చాలామంది  తల్లిదండ్రులు ఈప్రోగ్రాం వస్తున్నప్పుడు ఛానల్ మార్చే పరిస్ధితి,ఈప్రోగ్రాంతోని శ్యాం ప్రసాద్ రెడ్డిగారు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్రో అర్ధం కావటంలేదు,ఈ ప్రోగ్రాం పైన పలు మహిళా సంఘాలు ఇప్పటికే  మస్తు గరంమీదున్నరు,మస్తు జాగలల్ల కేసులు కూడా బుక్కైనయ్ అయినా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ప్రోగ్రాంస్  ఎంకరేజ్ చేస్తున్నారో..ఆయనకే తెలియాలి.

దొందూ దొందే…అన్నట్టు

ఒకప్పడు మంచి సినిమాలు తీసిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు,ఇప్పుడు బూతు షోలు చేస్తున్నట్టు,అలాగే ఒకప్పుడు ఈటీవీ అంటే మంచి సీరియళ్లు అందించిన రామోజీరావు కూడా  ఇప్పుడు ఇలాంటి షోలను ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న శ్యాంప్రసాద్ రెడ్డికి….కొడ్కు సుమన్ తీసిన ఫ్యామిలీ సీరియళ్లు చూసిన  రామోజీరావ్ కు బోర్ కొట్టినట్టుంది…అందుకే ఇలా యూత్ ని టార్గెట్ చేసి ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు చేస్తున్నారు.

అయ్యా సార్లు  టీవీ అంటే ఒక్క యూత్ వాళ్లే చూస్తారనే బ్రమలో ఉన్నట్టున్నారు..అమ్మ నాన్న అక్క చెల్లి  కొడుకు తమ్ముడు ఇలా అన్ని రకాల ప్రేక్షకులు ఉంటారు,అది దృష్టిలో పెట్టుకొని  ప్రోగ్రామ్స్ చేస్తే…అందరూ తప్పకుండా ఆదరిస్తారు..మీకు కూడా మంచి పేరస్తుంది, ఎంతసేపు పైసల మీదనే పడకుండా..విలువల గురించి కూడా ఆలోచించి మంచి ప్రోగ్రాంలు చెయ్యాలని ..అభిప్రాయపడుతున్నారు,మీ బూతు ప్రోగ్రాంలు చూసి  విసిగిపోయిన ప్రేక్షకులు.అయ్యా శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మీరు తీసిన ఆహుతి, అంకుశం,తలంబ్రాలు వంటి మంచి చిత్రాలు, మంచి ప్రోగ్రాంలు మీనుంచి  వస్తాయని ఆశిస్తూ…